తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ (ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన) పథకం అమలు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ క్రమంలో నేషనల్ హెల్త్ అథారిటీతో తెలంగాణ వైద్యారోగ్యశాఖ ఎంవోయూ కుదుర్చుకుంది. అగ్రిమెంట్ ప్రకారం ఆయుష్మాన్ భారత్ పథకం అమలుకు సంబంధించిన విధి విధానాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఖారారు చేసింది. పథకం నియమ నిబంధనలను అనుసరిస్తూ రాష్ట్రంలో వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించి ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఆయుష్మాన్ భారత్ పథకం కార్డుతో ఆస్పత్రిలో చేరితే రూ. 5లక్షల వరకు చికిత్స ఉచితం. దీని కింద దేశవ్యాప్తంగా 20 వేలకు పైగా ఆస్పత్రుల్లో 1000 కి పైగా వ్యాధులకు ఫ్రీగా ట్రీట్ మెంట్ చేయించుకోవచ్చు.
